69వ జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన నటుడు అల్లు అర్జున్‌ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే.. అవార్డులు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే.. నల్లగొండకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులుకి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు దక్కడంపైనా సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
జాతీయ అవార్డు విజేతలకు కేసీఆర్ అభినందనలు
August 26, 2023
0
Tags