విడిపోయిన కెనడా ప్రధాని దంపతులు

Telugu Lo Computer
0


కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోయారు. తన భార్య సోఫీ గ్రెగోయిర్ (48) నుండి విడిపోతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (51) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరోవైపు, సోఫీ కూడా..భర్త (జస్టిన్ ట్రూడో) నుంచి విడిపోతున్నట్లు ఓ సోషల్ మీడియా పోస్ట్ లో ప్రకటించింది. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఆ దంపతులిద్దరూ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులు పెట్టి వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా అర్థవంతమైన, కష్టతరమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎప్పటిలాగే తమ మధ్య ఏర్పడిన లోతైన ప్రేమ, గౌరవం ఇక ముందు కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు..పిల్లల శ్రేయస్సును గౌరవిస్తూ వారి గోప్యతకు భంగం కలగకుండా చూడాలన్నారు. కాగాజస్టిన్ ట్రూడో(Justin Trudeau)-సోఫీ గ్రెగోయిర్(Sophie Gregoire) 2005లో వివాహం జరగ్గా.. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. వాళ్ల పేర్లు.. జేవియర్ (15), ఎల్లా-గ్రేస్ (14), హాడ్రియన్ (9). కెనడా ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో..చట్టపరమైన విభజన ఒప్పందంపై దంపతులు సంతకం చేసినట్లు తెలిపింది. విడిపోయినప్పటికీ, తమ పిల్లలను సురక్షితమైన, ప్రేమపూర్వకమైన, సహకార వాతావరణంలో పెంచడంపై సోఫీ మరియు ప్రధాన మంత్రి దృష్టి సారించారు. తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లల జీవితాల్లో స్థిరమైన ఉనికిని కలిగి ఉంటారు. వచ్చే వారం నుండి కుటుంబం సెలవులో కలిసి ఉంటుంది. వచ్చే వారం నుంచి సెలవుల్లో కలిసి సమయాన్ని గడపాలని ప్లాన్ చేస్తున్నందున.. ఈ సవాలు సమయంలో వారి గోప్యతను గౌరవించాలని జస్టిన్ ట్రూడో కార్యాలయం ప్రజలను కోరింది. పదవిలో ఉన్నప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించిన రెండవ కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో నిలిచారు. జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ట్రూడో కూడా 1979లో అతని భార్య మార్గరెట్ నుంచి విడిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)