పెళ్లి పేరుతో నటిపై పలుసార్లు అత్యాచారం!

Telugu Lo Computer
0


ముంబయిలో పెళ్లి పేరుతో ఓ బిజినెస్‌మెన్ అత్యాచారానికి పాల్పడినట్లు నటి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. కాగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని నటి ముంబై పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టాంజానియాకు చెందిన వ్యాపారి వీరేన్ పటేల్‌పై ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)