యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లోని దుబాయ్ నగరం పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో మెరిసిపోతుంటుంది. ఈ మహా నగరంలో 2018లో అమెజాన్ కెరెఫోర్ మినీ అనే షాపింగ్ స్టోర్ తెరిచింది. ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా పేరొందింది. ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్ ఉండాలి. ఇది ఉంటేనే స్టోర్‌లోనికి ప్రవేశం లభిస్తుంది. లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోర్‌లో హై రిజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవి వినియోగదారుల ప్రతీ కదలికను పర్యవేక్షిస్తుంటాయి. స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులోప్రత్యక్షమవుతాయి. షాపింగ్ పూర్తయిన తరువాత పేమెంట్ ఆదే ఫోను ద్వారా చేయాల్సి వుంటుంది. కెరెఫోర్ సీఈఓ హనీ వీస్ మాట్లాడుతూ భవిష్యత్‌లో అంతా ఇలానే ఉంటుందని, ఈ స్టోర్‌లోకి వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారని అన్నారు.
అమెజాన్ కెరెఫోర్ మినీ స్టోర్ లో చెల్లింపులన్నీయాప్ ద్వారానే !
August 07, 2023
0
Tags