ఉత్తరప్రదేశ్ లో సుజన్ అహిర్‌వార్ అనే వ్యక్తి బైక్‌పై చికెన్‌ను అమ్ముతుంటాడు. అయితే ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో కొందరు నిందితులు అతన్ని అడ్డుకొని చికెన్ ఇవ్వమని అడిగారు. దానికి అతను డబ్బులు ఇస్తేనే చికెన్ ఇస్తామనడంతో ఆ వ్యక్తిని కొందరు యువకులు చెప్పులతో చితకబాదారు. అయితే ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియో ఆధారంగా నిందితుల పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ దళితుడి పట్ల ఇలా చెప్పులతో దాడికి పాల్పడం సరికాదని, నిందితులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలంటూ అక్కడి దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
చికెన్ కి డబ్బులు అడిగాడని చెప్పులతో చితకబాదారు !
August 13, 2023
0
Tags