ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాదం చోటు చేసుకుంది.అంతిమయాత్రలో జరిగిన తొక్కిసలాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ కన్నుమూశారు. తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన జహీరుద్దీన్ కు గుండెపోటు రాగానే.. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచారు. సోమవారం రోజు సాయంత్రం అల్వాల్‌లోని మహాబోధి స్కూల్లో అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర స్కూల్ ఆవరణకు చేరుకుంది. అయితే.. చివరి చూపు కోసం వేలాది మంది ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ తొక్కిసలాటలో జహీరుద్దీన్ అలీ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటుతో చనిపోయారు.
గద్దర్ అంత్యక్రియల తొక్కిసలాటలో సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ మృతి !
August 07, 2023
0
Tags