రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటుకు తెరలేపిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవెగనీ ప్రిగోజిన్ విమానప్రమాదంలో మరణించడం చర్చనీయాంశంగా మారింది. వాగ్నర్ మృతిని క్రెమ్లిన్ ఇంకా ధ్రువీకరించలేదు. మృతదేహాల వైద్య పరీక్ష అనంతరమే దీనిపై ప్రకటన చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వాగ్నర్ గ్రూప్‌ను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చునేందుకు పుతిన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ బృందానికి ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యాకు విధేయంగా ఉంటామని వాగ్నర్ సైనికులు ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాలని పుతిన్ ఆదేశించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ''ఉక్రెయిన్ లో ప్రత్యేక సైనిక చర్యలో రష్యా ప్రభుత్వం తరఫున పాల్గొంటున్న ప్రైవేటు సైనికులందరూ (వాగ్నర్ గ్రూప్‌ను ఉద్దేశిస్తూ) ఈ ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాల్సిందే'' అని క్రెమ్లిన్ తమ వెబ్‌సైట్‌లో ప్రచురించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
వాగ్నర్ సైనికులతో పుతిన్ సంతకాలు !
August 26, 2023
0
Tags