వందే భారత్ రైలుపై రాళ్ల దాడి

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని బారాబంకిలో వందేభారత్ రైలుపై దుండగులు రాళ్లు రావడంతో ఒక కోచ్ కిటికీలు పగిలిపోయాయి. గోరఖ్‌పూర్ నుంచి లక్నోకు ఆదివారం ఉదయం 6 గంటలకు వందే భారత్ రైలు బయల్దేరింది. బారాబంకిలో సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో కోచ్ కిటికీలు పగిలిపోయాయి. ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదు. రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్) ఈ ఘటనపై కంట్రోల్ రూంకు సమాచారం అందించింది. దీంతో బారాబంకి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుుక సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైలులో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)