ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాల కారణంగా విద్యార్ధులకు జరుగుతున్న నష్టానికి నిరసనగా తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఒక్కరోజు విద్యాసంస్ధలు మూతపడనున్నాయి. ఈ మేరకు టీఎస్ఎస్ఎఫ్ విద్యాసంస్ధల యాజమాన్యాలు, అధికారులకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 77ను రద్దు చేయాలని, ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వా లని, మెగా డీఎస్సీ నిర్వహించాలని టీఎన్ఎస్ఎఫ్ కోరుతోంది. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని, సంక్షేమ హాస్టళ్లు ఆధునీకరించాలని, విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని కోరుతోంది. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా తెలంగాణ తరహాలో మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఇదే కోవలో మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. https://t.me/offerbazaramzon
రేపు విద్యాసంస్థల బంద్ !
July 24, 2023
0
Tags