జపాన్‌లోని కవాసాకి నగరంలో ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ఉంది. ఎత్తయిన అరుగులు ఉన్న ఇళ్లకు ఉండే మెట్ల కంటే తక్కువ మెట్లతో ఈ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేశారు. కవాసాకి రైల్వే స్టేషన్ దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వస్తే, ఎదురుగా కనిపించే 'మోర్'' డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఉంది ఈ బుల్లి ఎస్కలేటర్. దీనికి ఉన్నవి కేవలం ఐదు మెట్లు మాత్రమే ! చిన్నపిల్లలు కూడా ఆమాత్రం మెట్లు ఎక్కగలిగినప్పుడు ఈ ఎస్కలేటర్‌ను ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ అర్థంకాదు. అయినా, వింతగా ఉండటంతో దీనిని చూడటానికి జనాలు ఇక్కడకు వస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఎస్కలేటర్‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది. https://t.me/offerbazaramzon
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ !
July 24, 2023
0
Tags