ముంబయి లోని గోరెగావ్ లో సీరియల్ షూటింగ్ జరుగుతుండగా సెట్‌లోకి అకస్మికంగా చిరుత పులి రావడంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గోరెగావ్‌లోని ఫిల్మ్ సిటీ ప్రాంతంలో మరాఠి సీరియల్ షూటింగ్ జరుగుతోంది. నటులు, టెక్నిషియన్లతో కలిపి మొత్తం 200 మంది సెట్‌లో ఉన్నారు. అకస్మికంగా చిరుత పులి దాని పిల్లతో సెట్‌లోకి ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. భయంతో తప్పించేందుకు పరుగులు పెట్టారు.అయితే చిరుత ఎవరికి హాని కలిగించలేదు. ఇలా చిరుత సెట్‌లోకి రావడం మొదటి సారి కాదని అక్కడున్న వారు తెలిపారు. పదేపదే ఇలా జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ''షూటింగ్ జరుగుతుండగా ఒక చిరుత రావడం మొదటిసారి కాదు. గత 10 రోజుల్లో నాలుగు సార్లు సెట్‌లోకి ప్రవేశించింది. ప్రభుత్వానికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టడం లేదు. చిరుత ఏ క్షణమైనా దాడి చేయవచ్చు. ఎవరైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది''అని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా తెలిపారు. https://t.me/offerbazaramzon
సీరియల్ షూటింగ్ సెట్‌లోకి చిరుత పులి !
July 27, 2023
0
Tags