డైమండ్ లీగ్ దోహ అంచె పోటీల్లో పసిడితో ఈ సీజన్‌ను ఘనంగా మొదలెట్టిన నీరజ్‌ను గాయం ఇబ్బంది పెట్టింది. తిరిగి ఫిట్‌నెస్ సాధించిన అతను లూసానెలో 87.66 మీటర్ల దూరం ఈటెను విసిరి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి నాలుగు ప్రయత్నాలు ముగిసే సరికి రెండో స్థానంలో కొనసాగిన నీరజ్, అయిదో ప్రయత్నంలో ఉత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. దోహా (88.67మీ)తో పోలిస్తే ఇప్పుడు కఠిన పరిస్థితుల్లో జావెలిన్‌ను అతను కాస్త తక్కువ దూరమే విసిరాడు. తొలి, నాలుగు ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన నీరజ్.. మధ్యలో వరుసగా 83.52మీ, 85.04మీ. ప్రదర్శన చేశాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 84.15మీ దూరాన్ని అందుకున్నాడు. జులియన్ వెబర్ (జర్మనీ- 87.03మీ), జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్- 86.13మీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. దీంతో 16 పాయింట్లతో నీరజ్ డైమండ్ లీగ్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నాడు. లూసానెలో అద్భుత ప్రదర్శన చేసిన నీరజ్ ఇక నేరుగా వచ్చే నెల 19న ఆరంభమయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనే పోటీపడనున్నాడు. అంతకంటే ముందు ఇతర ఏ పోటీల్లోనూ పాల్గొనని అతనన్నాడు. ''గాయం నుంచి కోలుకుని వచ్చిన నేను కాస్త ఒత్తిడికి గురయ్యా. ఇక్కడ కొంచెం చలిగా ఉంది. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయా. కానీ ఇది మెరుగవుతుందని అనుకుంటున్నా. ఇక్కడ గెలవాలనుకున్నా. కాబట్టి సంతోషమే. కానీ శిక్షణలో కొన్ని పొరపాట్లు సరిదిద్దుకోవాల్సి ఉంది. అప్పుడు మరింత బలంగా మారతా. లుసానె నగరం నాకు కలిసొచ్చింది. నిరుడు ఇక్కడ విజయం సాధించా. ఇప్పుడూ నెగ్గా. వచ్చే ఏడాది కూడా ఇక్కడ గెలుస్తా. ఇక తర్వాతి పోటీ అంటే బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్సే. అదెంతో ప్రతిష్ఠాత్మకమైంది'' అని 25 ఏళ్ల నీరజ్ పేర్కొన్నాడు. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ రజతం గెలిచిన సంగతి తెలిసిందే. https://t.me/offerbazaramzon
నీరజ్‌కు డైమండ్ లీగ్‌లో మరో స్వర్ణం
July 02, 2023
0
Tags