కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీలలో ఒకటైన అన్నభాగ్య పథకం కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ)ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం సాయంత్రం ప్రారంభిస్తారని కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్. మునియప్ప తెలిపారు. అన్నభాగ్య యోజన నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి. 15 రోజుల్లో ప్రతి లబ్ధిదారునికి డబ్బులు అందజేస్తామని మంత్రి మునియప్ప హామీ ఇచ్చారు. అన్నభాగ్య పథకం కింద 10 కిలోల బియ్యం ఉచితంగా అందించడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఐదు హామీలలో ఒకటి. ప్రస్తుతం అదనపు బియ్యం అందుబాటులో లేకపోవడంతో డబ్బులు చెల్లిస్తామని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. ఒక కేజీ బియ్యానికి రూ. 34 ఉండగా ఐదు కేజీలకు రూ.170 చెల్లించాలని నిర్ణయించారు. కర్ణాటక ప్రభుత్వం బియ్యం తెప్పించాలని ప్రయత్నించినా కేంద్రం ఇవ్వలేదని కర్ణాటక మంత్రి కేహెచ్. మునియప్ప ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలను సంప్రధించి బియ్యం కొనుగోలు చెయ్యాలని ప్రయత్నించినా రేటు ఎక్కువగానే ఉందని, దీని ప్రకారం బియ్యం అందుబాటులోకి వచ్చే వరకు బియ్యంకు బదులుగా డబ్బులు చెల్లించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి మునియప్ప తెలిపారు. https://t.me/offerbazaramzon
రేషన్ కార్డు ఉంటే బ్యాంక్ అకౌంట్ బియ్యం డబ్బులు డిపాజిట్ !
July 08, 2023
0
Tags