హర్మన్‌పై సస్పెన్షన్‌ వేటు ?

Telugu Lo Computer
0


భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన చివరి పోరులో హర్మన్‌.. అంపైరింగ్‌ తీరును తప్పుపట్టింది. వికెట్లను బ్యాట్‌తో కొట్టడంతో పాటు.. మ్యాచ్‌ అనంతరం కూడా దీనిపై వ్యాఖ్యలు చేసింది. బహుమతి ప్రదానోత్సవంలో బంగ్లా కెప్టెన్‌తోనూ హర్మన్‌ దురుసుగా ప్రవర్తించింది. దీంతో ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ హర్మన్‌ మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత పడింది. అయితే హర్మన్‌కు ఐసీసీ డీమెరిట్‌ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది. ఐసీసీ లెవల్‌-2 నిబంధనను దాటినట్లు భావిస్తున్న నేపథ్యంలో హర్మన్‌కు 4 పాయింట్లు కేటాయిస్తే.. ఆమె ఒక టెస్టు లేక రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సస్పెన్షన్‌ పడితే.. ఆసియా క్రీడల్లో తొలి మ్యాచ్‌లకు హర్మన్‌ దూరం కానుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)