కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని చిక్కోడి తాలూకాలోని హిరేకోడిలోని నందిపర్వత ఆశ్రమానికి చెందిన కామకుమార నంది మహారాజా జైన మునిని డబ్బు కోసం ఆక్ష్న ఆశ్రమంలోని భక్తులు హత్య చేశారని వెలుగు చూసింది. జైన ముని కామకుమార నంది మహారాజకు కరెంట్ షాక్ ఇఛ్చి చంపేశారని, తరువాత ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికేసి శరీర భాగాలను వరి పొలంలోని పెద్ద పాడుబడిన బావిలో విసిరారని వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ విషయమై పూర్వాశ్రమంలోని జైన ముని బంధువు ప్రదీపా నందగావ్ ప్రముఖ కన్నడ టీవీ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ వివరాలు చెప్పారు. హిరేకోడి ఆశ్రమంలో మునీశ్వరులు అయిన కామాకుమార నంది మహారాజ మునికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారని ఆరోపించారు. అనంతరం జైన ముని మృతదేహాన్ని నరికి కటకబావి గ్రామంలోని ఓ పాడుపడిన బావిలో పడేశారని, ఈ విషయం గురించి లీసులు సమాచారం ఇవ్వడంతో మేము కూడా షాక్ అయ్యామని అన్నారు. కామకుమార్ ముని అదృశ్యమైనప్పుడు ప్రధాన నిందితుడు మాతో కలిసి ముని కోసం వెతికాడని ప్రదీప చెప్పారు. జైన మహర్షిని హత్య చేసిన నిందితుడిని ఆశ్రమ భక్తుడైన మహదేవ్‌గా గుర్తించామని, అతని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాని జైన ముని సమీప బంధువు ప్రదీప అన్నారు. అలాగే ఆశ్రమానికి చెందిన కామకుమార ముని కనిపించకుండా పోయినప్పుడు ప్రధాన నిందితుడు మాతో కలిసి వెతికాడు. ఆశ్రమం చుట్టూ ఉన్న చెరకు పొలాల చుట్టూ కామకుమార ముని తిరిగారని ఒక కట్టు కథ అల్లిన మహదేవ్ ఇటు ఆశ్రమం భక్తులు, పోలీసులకు తప్పుదోవ పట్టించాడని ప్రదీప ఆరోపించారు. మహదేవ్ మాయ మాటలను గమనించిన పోలీసులు అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. జైన మునికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశామని నిందితుడు అంగీకరించాడని పోలీసులు అన్నారు. జైన మహర్షులను చంపిన వారిని శిక్షించాలని ఆశ్రమం భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కామకుమార మహర్షులను చంపిన నిందితులకు తగిన శిక్ష విధించాలని జైన ముని బంధువు ప్రదీప డిమాండ్ చేశారు. కామకుమార ముని మృతదేహం లభ్యమైన తర్వాత ఆశ్రమంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని పూర్వాశ్రమం బంధువు ప్రదీప ప్రముఖ కన్నడ టీవీ చానల్ కు చెప్పారు. https://t.me/offerbazaramzon
జైన మహార్షిని కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు !
July 08, 2023
0
Tags