యాపిల్ వాచ్ సిరీస్ 8 ఆర్డర్ చేస్తే, తనకు అమెజాన్ ఫేక్ ప్రొడక్ట్ డెలివరీ చేసిందని ఓ మహిళ ట్వీట్ చేసింది. బాధితురాలు ఆ నకిలీ ప్రొడక్ట్ ఇమేజ్‌లను కూడా యాడ్ చేసింది. ఆమె చేసిన పోస్ట్‌లో 'నెవర్ ఆర్డర్ ఫ్రమ్ అమెజాన్. జులై 8వ తేదీన అమెజాన్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 8 ఆర్డర్ చేశాను. అయితే 9వ తేదీన ఫేక్ 'ఫిట్‌లైఫ్' వాచ్ డెలివరీ చేశారు. దీనిపై అమెజాన్‌కి చాలా కాల్స్ చేశాను. కానీ అమెజాన్ కస్టమర్ సర్వీస్ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.' అని పేర్కొంది. ఆ మహిళ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. అమెజాన్ తీరును తప్పుబడుతూ మహిళ చేసిన పోస్ట్ కొద్ది సేపటిలోనే వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఆ పోస్ట్‌కి రెస్పాండ్ అయ్యారు. పెద్ద సంఖ్యలో యూజర్లు కామెంట్స్‌లో తమ అభిప్రాయాలను, అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొంతమంది వినియోగదారులు ఇలానే తాము నకిలీ ప్రొడక్టులు అందుకున్న విషయాలను వెల్లడించారు. రూ.50900 అనేది బిగ్ అమౌంట్ అని, ఒక ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌పై నమ్మకం ఉంచి విలువైన ప్రొడక్ట్ కొనుగోలు చేసినప్పుడు, సర్వీసు కూడా అలానే ఉండాలని తెలిపారు. https://t.me/offerbazaramzon
యాపిల్ వాచ్‌కు బదులు 'ఫిట్‌లైఫ్' వాచ్ డెలివరీ !
July 13, 2023
0
Tags