తమిళనాడు లోని నీలగిరి జిల్లా కున్నూరు - మేట్టుపాళయం రహదారిలో కేఎన్‌ఆర్ నగర్ సమీపంలోని ఘాట్‌లో మంగళవారం మధ్యాహ్నం అడవి ఏనుగు సంచరించింది. ఆ ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. అటవీప్రాంతం నుండి వచ్చిన ఆ ఏనుగు రహదారిని దాటుకుని వెళ్తుండగా కారులో, వ్యాన్‌లో వచ్చిన కొందరు పర్యాటకులు దానికి చేరువగా వాహనాలను తీసుకెళ్ళారు. ఆ తర్వాత సెల్‌ఫోన్లలో ఆ ఏనుగును ఫోటో తీసేందుకు, సెల్ఫీలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఆ ఏనుగు ఘీంకరిస్తూ వారి వెంటపడింది. దీనితో బిత్తరపోయిన పర్యాటకులు గబగబా వాహనాలెక్కి రివర్స్‌గేర్‌లో వేగంగా అక్కడి నుండి కదిలారు. కాసేపయ్యాక ఆ ఏనుగు ప్రశాంతంగా సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. https://t.me/offerbazaramzon
పర్యాటకుల వెంట పడిన ఏనుగు !
July 20, 2023
0
Tags