చెన్నై పరంగిమలై ప్రాంతంలో నవీన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చెన్నైలోని యేహూ కినారు ప్రాంతానికి చెందిన ఓ కాలేజీ విద్యార్థినితో నవీన్ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు నవీన్ అతని ప్రియురాలితో కలిసి బైక్ లో తిరిగాడు. ఇటీవల ఆమె నవీన్ తో మాట్లాడటం మానేసిందని వాళ్ల స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో కళాశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని ఆమె మాజీ ప్రియుడు నవీన్ అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. తరువాత ప్యాంట్ లో ముందుగా దాచుకున్న కత్తితో విద్యార్థిని మెడపై ఇష్టం వచ్చినట్లు పొడిచిన నవీన్ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రక్తపు మడుగులో పడిపోవడంతో స్థానికులు ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు నవీన్‌ను దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న తరువాత నవీన్ స్పృహతప్పి పడిపోయాడు. అయితే పోలీసులు నవీన్ ముఖం నీళ్లు చల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాలేజ్ విద్యార్థినిపై నవీన్ కత్తితో దాడి ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. తనను ప్రేమించి ఇంతకాలం తనతో తిరిగి ఇప్పుడు తనను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపేయాలని అనుకున్నానని నవీన్ చెప్పాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. https://t.me/offerbazaramzon
యువతిని కత్తితో పొడిచిన మాజీ బాయ్ ఫ్రెండ్ !
July 08, 2023
0
Tags