అత్యాధునిక టెక్నాలజితో తిరుమలలో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నట్లు, ఎలాంటి భద్రతాపరమైన సమస్యనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు. బుధవారం పీఎసీ- 4లోని సమావేశ మందిరంలో తిరుమల అదనపు ఎస్పీ ముని రామయ్యతో కలిసి అదనపు ఎస్పీ నాగేష్ బాబు ఆక్టోపస్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, వైద్య, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ తిరుమలలో తరచుగా ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా భద్రత లోపాలను అధిగమించవచ్చు అన్నారు. సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు ఎలా తిప్పికొట్టి భక్తులకు రక్షణ కల్పించాలి అనేది ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు. ఆక్టోపస్ డీఎస్పీ నరసింహారావు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఏ విభాగం అధికారులు, సిబ్బంది ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలను, భక్తులను తిరుపతిలోని అలిపిరి దగ్గర నిలిపివేసి క్షుణ్ణంగా సోదాలు చేస్తారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో అనుమానం వస్తే భక్తులను సోదాలు చేస్తుంటారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ల్లో పలు చోట్ల సోదాలు చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ వస్తులు, మొబైల్ ఫోన్ లతో పాటు నిషేదిత వస్తువులను శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులు తీసుకెళ్లడానికి ఎలాంటి అవకాశం లేదు. https://t.me/offerbazaramzon
అత్యాధునిక టెక్నాలజీతో పటిష్టమైన ఆక్టోపస్ పోలీసు దళం !
July 05, 2023
0
Tags