ట్విటర్‌లో బయోడేటా మార్చుకున్న అజిత్‌పవార్‌ !

Telugu Lo Computer
0


హారాష్ట్రలో ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్‌ పవార్‌, ఆ తర్వాత కాసేపటికే ట్విటర్‌లో తన బయోడేటాను మార్చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అని ఉన్న స్థానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని రాసుకున్నారు. ఆ తర్వాత బారామతి నియోజకవర్గ ఎమ్మెల్యే అని, మహారాష్ట్ర అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత అని తన ట్విటర్‌ బయోడేటాలో పేర్కొన్నారు. కాగా, ఎన్సీపీలో సీనియర్‌ నాయకుడు, శరద్‌ పవార్‌కు సోదరుడి కుమారుడు అయిన అజిత్‌ పవార్‌ ఇవాళ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని రెండు ముక్కలుగా చీల్చారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని సంకీర్ణ ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించి డిప్యూటీ సీఎం పదవి సంపాదించారు. తన వెంట వచ్చిన మరో 9 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)