తవుడు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


బియ్యం పాలిష్ పట్టగా వచ్చే పిండిని తవుడు అంటాం. సాధారణంగా ఈ తవుడును పశువులకు ఆహారంగా పెడుతుంటారు. ఇది పశువులే కాదు, మనుషులు కూడా తినొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు.. శరీరానికి అవసరమయ్యే ఎన్నోరకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. 344 మందిపై 6 నెలలపాటు ఇరాన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ప్రతిరోజూ 2 నుంచి 3 స్పూన్ల తవుడు తీసుకోవడం వల్ల శరీరంలో 40 శాతం మేర ఆక్సిడెంట్లు పెరుగుతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడకుండా కాపాడుతాయి. తవుడులో ఉండే గామా ఒరైజనాల్ అనే రసాయన సమ్మేళనం శరీరంలో ఇన్ ప్లామేషన్ ను పెంచే ఎంజైమ్ లను నశింపజేయడంలో సహాయపడుతుంది. తవుడులో ఉండే ఫైబర్ వల్ల మంచి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. అలాగే విటమిన్ B1, B2, B3, B5, B6, B7,B9, B12 వంటి బి కాంప్లెక్స్ విటమిన్లన్నీ శరీరానికి లభిస్తాయి. 100 గ్రాముల తవుడులో 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది కాబట్టి.. ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. శరీరానికి కావలసిన ప్రొటీన్, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తవుడును నేరుగా తినొచ్చు లేదంటే.. చపాతీ పిండిలో కలుపుకుని తినొచ్చు. మినుములతో చేసే సున్నుండల్లోనూ తవుడును కలిపి చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)