ప్రాణం తీసిన ఫొటోషూట్‌ !

Telugu Lo Computer
0


కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సిద్ధిక్‌, నౌఫీలకు వారం క్రితమే వివాహమైంది. ఓ శుభకార్యం కోసం బంధువుల ఇంటికి వెళ్లారు. పెళ్లి తర్వాత ఈ నవ జంట ఫొటో షూట్‌ కోసం వారి బంధువు అన్సిల్‌తో కలిసి తిరువనంతపురంలోని పల్లికల్‌ నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా  ప్రమాదవశాత్తు జారిపడి నదీ ప్రవాహాంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో అన్సిల్‌ కూడా నదీలో గల్లంతయ్యాడు. శనివారం సాయంత్రం అన్సిల్ మృతదేహాం దొరకగా, ఆదివారం దంపతులిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం ముగ్గురి మృతదేహాలను కొల్లాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద నూతన దంపతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)