లోన్ చెల్లించలేదని భార్యపై వడ్డీ వ్యాపారి అత్యాచారం !

Telugu Lo Computer
0


హారాష్ట్రలో ఓ వ్యక్తి లోన్ చెల్లించలేదని అతని భార్యను ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు వెల్లడించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు వడ్డీ వ్యాపారి వద్ద కొంత మొత్తంలో డబ్బును లోన్‌ రూపంలో తీసుకున్నాడు. కానీ సకాలంలో లోన్‌ చెల్లించలేకపోయాడు. దీంతో వడ్డీ వ్యాపారి దారుణంగా ప్రవర్తించారు. బాధితున‍్ని కత్తితో బెదిరించి, అతని భార్యను అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘోరం బాధితుని కళ్లముందే జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌తో సహా సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)