మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో నడుస్తున్న కారులో ఓ వ్యక్తిని చితకబాదుతూ మరో వ్యక్తి పాదాలను నాకించిన ఘటన జరిగింది. సంబంధిత వికృత చర్యను తెలిపే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. ఈ రాష్ట్రంలోనే ఓ ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన జుగుప్సాకర ఘటన ఇప్పటికి కలుక్కు మన్పిస్తున్న దశలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్న కొందరు వ్యక్తులు కారువెళ్లుతుండగానే కొట్టారు. ఈ బాధిత యువకుడి తల అదిమి పట్టుకుని ఈ బృందంలోని వారు వారి కాళ్లను నాలుకతో తాకించారు. ఈ వ్యక్తిని చెప్పులతో తీవ్రంగా కొట్టడం, ఈ ఘటనను వెనుక నుంచి ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి సామాజిక మాధ్యమానికి దర్జాగా పంపించడం గురించి ఇప్పుడు పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటికి ఇద్దరిని అరెస్టు చేసినట్లు గ్వాలియర్ పోలీసులు తెలిపారు. సంబంధిత ఘటన శుక్రవారం జరిగినట్లు , అమానుషానికి పాల్పడ్డవ్యక్తులు దబ్రా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వ్యక్తిపై ఈ దుండగులు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరించారు? అనే వివరాలను పోలీసులు తెలియచేయలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసిన విషయాన్ని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ తరువాత ధృవీకరించారు. బాధితుడు కూడా దబ్రా ప్రాంతం వ్యక్తే అని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు దబ్రా స్థానిక పోలీసు అధికారి వివేక్ కుమార్ శర్మ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అక్కడి అదనపు ఎస్‌పి రాజేశ్ దండోతియా చెప్పారు. https://t.me/offerbazaramzon
మధ్యప్రదేశ్‌లో కాళ్లను నాలుకతో తాకించారు !
July 08, 2023
0
Tags