'సూపర్ స్టార్' మహేశ్ బాబు తనయ సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సాంగ్స్, డాన్స్, స్టడీ, గేమ్స్, ట్రిప్స్.. ఇలా ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంటారు. సితార టాలెంట్ చూసి ఆమె తల్లిదండ్రులు మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ తెగ ఆనందపడిపోతుంటారు. ముఖ్యంగా తన గారాల పట్టి ప్రతిభను చూసి సూపర్ స్టార్ సంతోషపడిపోతారు. తాజాగా సితార తొలి కమర్షియల్ యాడ్ చేశారు. 'పీఎంజే జువెలరీ'కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. సితార చేసిన తొలి కమర్షియల్ యాడ్ ఇది. ఈ యాడ్ కోసం సీతూ పాప మూడు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారని సమాచారం. సితార చేసిన తొలి కమర్షియల్ యాడ్‌ను 'సితార కలెక్షన్స్' పేరుతో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు. ఈ విషయాన్ని 'మహేశ్ సోషల్ మీడియా టీమ్' ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం సితారకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 'ప్రిన్సెస్ సితార' అని టైమ్ స్వ్కేర్‌పై రాసి ఉంది. ఫోటోలలో సీతూ పాప పలు రకాల జువెలరీ వేసుకుని చాలా అందంగా ఉన్నారు. టైమ్ స్వ్కేర్‌పై సితార పోటోలను చూసి మహేశ్ బాబు ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. టైమ్‌స్వ్కేర్‌లో సితారను చూడడం చాలా గర్వంగా ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అతి చిన్నవయసులో సితారకు దక్కిన గొప్ప గౌరవం అని అభిమానులు పేర్కొంటున్నారు. మంగళవారం (4 జూలై) అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సితార పోటోలను టైమ్ స్వ్కేర్‌పై ప్రదర్శించారు. సీతూ పాప మరోసారి సోషల్ మీడియా స్టార్ అయ్యారు. https://t.me/offerbazaramzon
సితార తొలి కమర్షియల్ యాడ్ !
July 04, 2023
0
Tags