మమతా బెనర్జీ మోకాలికి శస్త్రచికిత్స

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శస్త్ర చికిత్స జరిగింది. గతవారం దీదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మమత ఎడమ మోకాలికి గాయం అయింది. దీంతో శస్త్ర చికిత్స అవసరం ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎమ్ ఆసుపత్రిలో వైద్యులు దీదీకి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆమెను డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. 'ప్రస్తుతం సీఎం ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి చికిత్స కోసం సీఎంకు సమాచారం ఇస్తాం' అని సీనియర్ వైద్యుడు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)