అభిమానికి కేక్‌ తినిపించిన బాలయ్య !

Telugu Lo Computer
0


అమెరికా ఫిలడెల్ఫియాలో జరిగిన తానా సభల్లో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్న సంగతి తెలిసిందే. తానా సంబరాల్లో బాలకృష్ణ కుటుంబంతో పాటు ఓ యువతి దిగిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఆ యువతి ఎవరని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో వెతుకుతున్నారు. తానా సభలో తన అభిమానిని అంటూ ఓ యువతి బాలయ్య దగ్గరకు వచ్చింది. ఈరోజు తన పుట్టినరోజని ఆశీర్వదించమని కోరింది. దీంతో వెంటనే ఆమె కోసం కేక్‌ తెప్పించి కటింగ్‌ చేయించారు బాలయ్య. ఆ విధంగా పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. ఆయన సతీమణి వసుంధరతో పాటు ఆ యువతిని ఆశీర్వదించారు. ఆ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని బాలయ్య అందించారు. ఇవే ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)