హైదరాబాద్ లో భారీగా డ్రగ్ ఇంజెక్షన్లు సీజ్

Telugu Lo Computer
0


తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు యాంటీ నార్కోటిక్స్ వింగ్ బ్యూరో పోలీసులు. డ్రగ్స్ ఫెంటానిల్ సిట్రేట్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మల్కాజ్‌గిరిలో ఏఎస్‌ మెడికల్‌ ఏజెన్సీపై నార్కోటిక్స్ అధికారులు దాడులు చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా మెడికల్ ఏజెన్సీతో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులు సుశీల్ కుమార్ మిశ్రా,నేహా చింతమన్రావ్ భగవత్, బి. ఉదయ్ కిరణ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 లక్షలు విలువ చేసే ఫెంటానిల్ సిట్రేట్ ఇంజెక్షన్లు, మార్ఫిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, మిడాజోలం ఇంజెక్షన్, మార్ఫిన్ టాబ్లెట్లు,కోడైన్ ఫాస్పేట్ లను స్వాధీనం చేసుకున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)