31న మంత్రి మండలి సమావేశం
July 28, 2023
0
ఈనెల 31న మంత్రి మండలి సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ నూతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా 50 అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, ప్రభావిత ప్రాంతాలు, ఆయా పరిస్థితులపై కేబినెట్ లో చర్చ జరగనుంది. రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో..అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినేట్ చర్చించనున్నది. అలాగే రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినేట్ చర్చించనున్నది. అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినేట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినేట్ తగు నిర్ణయం తీసుకోనున్నది. ఇవేగాక రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు సంబంధించి నీటి సామర్ధ్యం, ప్రస్తుత నీటిమట్టం ఇలా అనేక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ మీటింగ్ సుదీర్ఘంగా జరగనున్నట్టు తెలుస్తుంది. దీనితో ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఆగస్టు నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా కేబినెట్ లో కూడా చర్చించనున్నారు. https://t.me/offerbazaramzon
Tags