దక్షిణ కొరియాలో వరద విపత్తు సంభవించింది. దక్షిణ కొరియాలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల వల్ల 26 మంది మరణించారు. వరదల్లో మరో పదిమంది గల్లంతు అయ్యారు. మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, కుండ పోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఐదు ఇళ్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మరణించారని దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం నుంచి కుండపోత వర్షాల కారణంగా 10 మంది గల్లంతయ్యారని, గురువారం నుంచి మరో 13 మంది గాయపడ్డారని ఆ దేశ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. జులై 9 వతేదీ నుంచి కురుస్తున్న అతి భారీవర్షాల వల్ల 5,570 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీవర్షాల వల్ల 25,470 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 4,200 మంది నిరాశ్రయులను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. భారీవర్షాలు, వరదల వల్ల 20 విమాన సర్వీసులు, బుల్లెట్, సాధారణ రైలు సర్వీసులను నిలిపివేశారు. 200 రోడ్లను వరదనీటి ప్రవాహంతో మూసివేశారు. https://t.me/offerbazaramzon
దక్షిణ కొరియా వరదల్లో 26మంది మృతి
July 16, 2023
0
Tags