ముంబైలోని షాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న పాల్ కానారన్ అనే వ్యక్తి తన పొరుగు ఇంటిలో ఉంటున్న వ్యక్తిని హత్య చేశాడు. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు ఒక ఇంటి నుంచి చెడు వాసన వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆ ఇంటిలో దుప్పటిలో చుట్టిన ఒక మృతదేహం కనిపించింది. పోలీసుల దర్యాప్తులో ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను అతని పొరిగింటిలో ఉన్న వ్యక్తి మందు పార్టీకి ఆహ్వానించాడు. పార్టీ చేసుకుంటున్న సందర్భంలో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఆ వ్యక్తిని దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి, అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫుడ్ డెలివరీ ఏజెంట్ దారుణం !
June 13, 2023
0
Tags