కర్ణాటకలోని బెంగళూరులో మనోజ్, వర్షితా భార్యా భర్తలు. వీరిది ప్రేమ వివాహం. అయితే కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. భర్త మనోజ్ పని చేయడం మానేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో వర్షితా గొడవపడి.. బెల్లందూరు సమీపంలోని ఇబ్బలూరులోని అమ్మగారి ఇంటికి వచ్చేసింది. అయితే తన భార్యను తిరిగి తెచ్చుకునేందుకు అత్తింటికి వెళ్లాడు అల్లుడు మనోజ్. అమ్మాయిని పంపేదీ లేదంటూ అత్త తెగేసి చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో ఉన్న అల్లుడు అత్త గీతను పొడిచి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
అత్తను పొడిచి చంపిన అల్లుడు !
June 14, 2023
0
Tags