ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలోని ఓ ప్రాంతంలో హారిఓం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు (12) జన్మించాడు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో చదువుకుంటున్నాడు. ఇదిలా ఉంటే హారిఓం గత కొంత కాలం నుంచి పూర్తిగా మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో రోజూ తాగొచ్చి భార్యను కొట్టేవాడు. కొన్ని రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ఆ బాలుడు తండ్రి దాడిని చూసి తట్టుకోలేకపోయాడు. ఇటీవల ఆ పిల్లాడు దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు. ఆ బాలుడుని పోలీస్ అధికారులు గమనించి ఏం జరిగిందని ప్రశ్నించారు. మా నాన్న రోజూ తాగొచ్చి మా అమ్మను ఇనుప రాడ్డు, బెల్టుతో కొడుతున్నాడు. వచ్చి మా అమ్మను రక్షించాలంటూ పోలీసులను వేడుకున్నాడు. ఆ పిల్లాడు మాటలు విన్న ఆ పోలీసుల మనసు కరిగి కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్లి అతని తండ్రిని అరెస్ట్ చేశారు. ఇక తల్లి స్పందించి నా భర్త ఇక నుంచి కొట్టనని ప్రమాణం చేశాడని, దయచేసి విడిచిపెట్టండంటూ పోలీసులను బాలుని తల్లి వేడుకుంది. దీంతో పోలీసులు హారిఓంను అరెస్ట్ చేశారు. https://t.me/offerbazaramzon
మా అమ్మను కాపాడండి సారూ.. !
June 29, 2023
0
Tags