తెలుగు రాష్ట్రాలలో బాయిలర్ చికెన్ ధరలు కొండెక్కాయి. వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ, చికెన్ కొనుగోళ్లు మాత్రం నానాటికీ ఊపందుకుంటున్నాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.200 పలికింది. కానీ, గత 15- 20 రోజులుగా రూ.300 నుంచి రూ.350కి పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ ధర రూ.350లకు చేరుకుంది. డిమాండ్ పెరడంతో ధర ఎంత ఉన్న ప్రజలు తప్పనిసరిగా చికెన్ కొనుగోలు చేస్తున్నారు. విజయవాడలో చికెన్ ధర ఆల్ టైం హైరేట్ కి చేరింది. మరోనెల రోజుల పాటు ఇవే రేట్లు కొనసాగే చాన్స్ ఉందంటున్నారు కోళ్ల ఫామ్ నిర్వహకులు. విజయవాడ, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో చికెన్ రేట్ అమాంతంగా పెరిగింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 350 కాగా, కిలో బోన్‌లెస్ చికెన్ ధర రూ.700లకు చేరింది. ఇక కోళ్ల ఫారంలోనే లైవ్ బర్డ్ కిలో రూ.166లకు పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు
June 10, 2023
0
Tags