కుల దురహంకార హత్య !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కోలార్‌ జిల్లా కేజీఎఫ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి కీర్తి, 24 ఏళ్ల గంగాధర్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరికి వేర్వేరు కులాలు కావడంతో యువతి తండ్రి కృష్ణమూర్తి వీరి ప్రేమను నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో యువతికి ఆమె తండ్రితో అనేకమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గంగాధర్‌తో ప్రేమను మర్చిపోవాలని కృష్ణమూర్తి తన కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె వినలేదు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదవ్వడంతో తీవ్ర కోపోద్రోక్తుడైన కృష్ణమూర్తి కూతురిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కూతురు ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా ఆమె మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు  కీర్తిది ఆత్మహత్య కాదు హత్య అని తేల్చారు. తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. గంగాధర్‌ మేస్త్రీగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కీర్తి మృతి విషయం తెలుసుకున్న గంగాధర్‌  తట్టుకోలేక సమీపంలోని రైలు పట్టాల వద్ద వస్తున్న రైలుకు ఎదురెళ్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు కేజీఎఫ్ పోలీస్ సూపరింటెండెంట్ కె ధరణి దేవి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)