నా భార్య నన్ను కారంతో చంపేస్తుంది

Telugu Lo Computer
0


జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి పూణే వీధుల్లో వడ పావ్, మిసల్ పావ్ వంటి ప్రసిద్ధ మహారాష్ట్ర స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించారు. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ ఫుడ్ తింటున్న సమయంలో హిరోషి సుజుకి స్పందన చూడవలసిందే. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ వీడియోలో హిరోషి వడ పావ్ రుచి చూస్తూ స్పైసీగా ఉందని చెప్పడం, ఆ సమయంలో ఆయన ముఖంలో కలిగే హావభావాలను చూడొచ్చు. ఇక అదే వీడియోలో, ఆయన భార్య ఇంకా 'నాకు మరింత స్పైసీగా తీసుకురండి' అంటూ ఆర్డర్ ఇవ్వడం చూడొచ్చు. ఇలాంటి భిన్న సందర్భాల్ని ఒక వీడియోగా రూపొందించి 'నా భార్య నన్ను కారంతో చంపేస్తుంది' అనే అర్థంలో ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)