వైరల్‌ అవుతున్న బ్యాంకు డిపాజిట్‌ స్లిప్‌ !

Telugu Lo Computer
0


ఉ‍త్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందిన ఒక బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్‌ స్లిప్‌లో ఒక వినియోగదారుడు రాశి (అమౌంట్‌) కాలమ్‌లో ఏమి నింపాడో తెలిస్తే ఎవరికైనా తెగ నవ్వు వస్తుంది. దీనిని చూసిన కొందరు తమ తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు తమ పొట్టపట్టుకుని పడీపడీ నవ్వుతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ ఫొటో పాతదే అయినప్పటికీ, సోషల్‌ మీడియాలో తరచూ పోస్ట్‌ అవుతూ, తెగ వైరల్‌ అవుతోంది.సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ట్విట్టర్‌లో @NationFirst78 అనే ఖాతా కలిగిన యూజర్‌ తొలుత దీనిని షేర్‌ చేశారు. దీనిలో ఒక బ్యాంకు డిపాజిట్‌ స్లిప్‌ కనిపిస్తోంది.
వినియోగదారుడు ఆ ఫారంలోని అన్ని కాలమ్‌లను సరిగానే పూరించాడు. అయితే 'రాశి'(అమౌంట్‌) కాలమ్‌లో తులారాశి అని రాశాడు. ఈ ఫారం హిందీ, ఇంగ్లీషు రెండు భాషలలో ఉంది. హిందీలో 'రాశి' అంటే ఇంగ్లీషులో అమౌంట్‌ అని అర్థం. అయితే ఆ మహాశయుడు రాశి అనగానే తన జన్మరాశి అనుకుని దానిని ఆ కాలమ్‌లో నింపాడు. దీనిని చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఇది తాజాగా వైరల్‌ అవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)