బెంగళూరులో ట్రాఫిక్ నియంత్రణకు 65 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు అనుమతులకై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తాజాగా ప్రతిపాదనలు పంపింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరిని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి బృందం భేటీ అయింది. ఇందుకు సంబంధించి మంత్రి నగరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో ట్రాఫిక్ తీవ్రమైన సమస్యగా మారుతోందని, ఫ్లై ఓవర్లు, రోడ్ల వెడల్పుతో సాధ్యం కావడం లేదని ప్రత్యామ్నాయమైన సొరంగ మార్గం ఏర్పాటు చేయదలిచామని మంత్రి సతీష్ జార్కిహోళి పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉంది. అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు జార్కహోళి పేర్కొన్నారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్ పురం – హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు. మంగళూరు జాతీయ రహదారి శిరాడిఘాట్ వద్ద సొరంగ మార్గం అంశం ప్రస్తావించిగా, దానికి కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ప్రకటించారు. హొన్నావర – కుమట, బెంగళూరు హెబ్బాళ్ జంక్షన్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు అనుమతులు కోరామని, రాష్ట్రానికి సంబంధించి మొత్తం 38 రోడ్లను నేషనల్ హైవేలుగా పరిగణించాలని కోరినట్లు మంత్రి సతీశ్ పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon
బెంగళూరు ట్రాఫిక్ నియంత్రణకు మెగా సొరంగ మార్గం !
June 29, 2023
0

Tags