చేప ప్రసాదం పంపిణీకి ముమ్మరంగా ఏర్పాట్లు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో చేప ప్రసాదం పంపిణీకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన కుటుంబ సభ్యులు 178 ఏండ్లుగా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కరోనా కారణంగా మూడేండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. పరిస్థితులు అంతా నార్మల్​అవడంతో ఈసారి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. మూడేండ్ల తర్వాత కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఏటా 4 లక్షల మంది వచ్చేవారు. ఈసారి రాష్ట్రంతోపాటు ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి 5 నుంచి 6 లక్షల మంది రావచ్చని బత్తిన కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. బుధవారం నాటికి చాలా మంది ఎగ్జిబిషన్​గ్రౌండ్​కు చేరుకునే అవకాశం ఉందని, వారికి ఫుడ్, వాటర్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ లోపల, బయట అందించేలా ప్లాన్​చేస్తున్నారు. ఇక చేప మందు కోసం మత్స్యశాఖ చేప పిల్లలను సమకూరుస్తోంది. ఇప్పటికే 2 లక్షల చేప పిల్లలు రెడీగా ఉంచినట్లు, అవరమైతే మరిన్ని అందిస్తామని మత్సశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 9 ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నిర్విరామంగా చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ తర్వాత రెండ్రోజులపాటు దూద్ బౌలిలోని బత్తిన సోదరుల ఇంటి వద్ద చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్​మెయిన్​గేట్​నుంచి లోపలికి రాగానే కుడి భాగంలో 18 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్యూలైన్ లో దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉంటుంది. చేప ప్రసాదం తీస్కునే ప్లేసుకు వెళ్లేసరికి క్యూలైన్లు 32 అవుతాయి. తర్వాత గ్రౌండ్​బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డు, హెల్త్, రెవెన్యూ, మత్స్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​అధికారులకు ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చేప ప్రసాదం పంపిణీపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. మంగళవారం మరోసారి అన్నిశాఖల అధికారులతో సమావేశం కానున్నారు. అంచనాకు మించి జనం వస్తే ఏం చేయాలనే దానిపై అధికారులు నిర్ణయం తీసుకోన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)