ఒడిశాలోని అనుగుల్ జిల్లా తాల్చేరు సమితి ఖండాలో పంచాయతీ పరిధిలోని గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఉంటున్న మహిళకు వివాహమైన కొన్ని రోజులకే భర్తను కోల్పోయింది. ఆమె సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుండేది. కొన్నాళ్ల క్రితం బాలుగామ్ ప్రాంతానికి చెందిన యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ రాత్రి సమయంలో ఆమె ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇంటిలో ఆమె అత్తమామలు అతణ్ని చూసినా ఏమీ చేయలేక మౌనం వహించారు. ఇటీవల వారు విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. రాత్రి యువకుడు గ్రామానికి వచ్చి వితంతువు ఇంటిలోకి వెళ్లాడు. ఆ సమయంలో కొందరు గ్రామస్థులు గది తలుపులకు బయట నుంచి తాళం వేశారు. గురువారం ఉదయం వారు తలుపులు తెరిచి యువకుడు, ఆమెతో ఉన్న మహిళను తాళ్లతో కట్టి గ్రామంలో ఊరేగించారు. తర్వాత విద్యుత్తు స్తంభానికి కట్టేశారు. అనంతరం గ్రామ పెద్దలు ఇరు కుటుంబాలవారిని పిలిచి చర్చించి వారిద్దరినీ వదిలిపెట్టారు. గ్రామస్థులు వారిని కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన చర్చనీయాంశమైంది.
వివాహేతర సంబంధం పెట్టుకున్నవారిపై గ్రామస్తులు దాడి
June 16, 2023
0
Tags