లోకో పైలెట్ ముందుచూపుతో కావేరి ఎక్స్‌ప్రెస్ తప్పిన పెను ప్రమాదం

Telugu Lo Computer
0


తమిళనాడులో లోకో పైలెట్‌ ముందుచూపుతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కావేరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రైల్వే ట్రాక్‌పై ఓ కాంక్రీట్ రాయి పడి ఉంది. కావేరీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ ఇది గమనించి రైలును ఆపాడు. దీంతో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రైలు ఆగింది. అయితే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై రాయి వేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను సాధారణంగా ట్రాక్ సమీపంలో ఉన్న ఆలయంలో ఉంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆ వ్యక్తి రాత్రి ఒంటి గంట సమయంలో ట్రాక్ దగ్గర కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)