మధ్యప్రదేశ్ లో ఊరేగింపు తర్వాత పెళ్లి జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. వర్షం పడకుండా ప్రజలు వాటర్‌ప్రూఫ్ మండపం కింద నిల్చున్నారు. మండపం ఎగువ భాగంలో ఎక్కువ నీరు చేరింది. దాంతో అది ఒక్కసారిగా కూలిపోయింది. మండపం కూలిపోగానే భయాందోళనలు చెలరేగాయి. జనం అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించారు. మండపం కొంత భాగానికి కరెంట్ కూడా వ్యాపించింది. ఆ కరెంట్ ఓ మహిళకు షాక్ కొట్టగా, ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందించారు.
తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వైద్యులు జబల్పూర్కి తరలించారు. వర్షం పడినప్పుడు వాటర్ ప్రూఫ్ మండపంలో తాము సురక్షితంగానే ఉన్నామనీ కానీ ఆ తర్వాత.. పైన నీరు ఎక్కువై పండల్ పడిపోయిందని పెళ్లికి వచ్చిన వారు తెలిపారు. వర్షపు నీరు నిలిచిపోకుండా ఉంటే బాగుండేదని తెలిపారు. మొత్తానికి పెళ్లైతే జరిగింది. వధూవరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జబల్పూర్ జిల్లాలోని గసాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మురాచ్ గ్రామంలో పిడుగు పడింది. 40 ఏళ్ల డాన్ సింగ్ మరణించాడు.