ఓ బ్రిటీష్ చెఫ్ చేసిన బిర్యానీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అంతేకాదు.. బిర్యానీ ప్రియులను హడలెత్తిస్తోంది. బాబోయ్ బ్రిటీషోళ్లతో బిర్యానీ జీవితంలో చేయించొద్దని అంటున్నారు. మరి అంతలా ఏం చేశారు? సాధారణంగా చికెన్ బిర్యానీని చికెన్, బాస్మతీ రైస్, మాంచి మసాలు, ఇతర వస్తువులను కలిపి చేస్తారు. అలా చేస్తేనే అసలైన మజా వస్తుంది. బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ చెఫ్ చికెన్ బిర్యానీ చేసిన విధానం చూసి బాబోయ్ ఇంకెప్పుడూ బ్రిటన్ వారితో బిర్యానీ చేయించొద్దని అంటున్నారు. అతను గ్యాస్‌పై వంటపాత్ర పెట్ అందులో నీరు పోశాడు. ఆ వెంటనే చికెన్ పీస్ వేశాడు. ఆ తరువాత టేస్ట్ కోసం ఉల్లిపాయు, స్ట్రాబెర్రీలను వేశాడు. కాసేపటికి రైస్ వేసి, పసుపు వేశాడు. ఇక బిర్యానీ రెడీ అన్నాడు. టేస్టీగా ఉందంటూ లాగేశాడు. ఈ బిర్యానీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా అది చూసిన నెటిజన్లు అతన్ని ఓసారి ఇటు పట్టుకురామ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే అడ్రస్ పెట్టు అంతు చూస్తా అంటూ కన్నెర్ర చేస్తున్నారు. ఛీ బిర్యానీని పాడు చేశావ్ కద సామీ అంటూ మరికొందరు ఇలా బిర్యానీ ప్రియులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.
స్ట్రాబెర్రీలతో చికెన్ బిర్యానీ !
June 21, 2023
0
Tags