గొంతు కోసి రక్తం తాగిన కిరాతకుడు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఓ వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకునన్నాడనే అనుమానంతో తన స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు. ఈ ఘటనలో నిందితున్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ స్నేహితుడు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన స్నేహితుడు మారేష్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని విజయ్ అనుమానించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తనను కలవాలని మారేష్‌ని కోరాడు. అనంతరం వారి మధ్య వాదన తీవ్రరూపం దాల్చడంతో ఆవేశానికి గురైన విజయ్.. పదునైన ఆయుధంతో మహేష్ గొంతు కోశాడు. మొబైల్ ఫోన్ లో తీసిన ఈ వీడియోలో, విజయ్ తన స్నేహితుడిని పట్టుకుని రక్తం తాగుతున్నట్లు కనిపించాడు. దాని కంటే ముందు పడుకున్న మారేష్‌ని ప్రశ్నించడం, విజయ్ అతని రక్తం తాగడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. అతను వంగి మారేష్ గొంతు నుండి కారుతున్న రక్తాన్ని తాగుతున్నట్లు కనిపించే ఈ దారుణమైన ఘటన ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్‌పై కెంచర్లహళ్లి పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు కాగా, మారేష్ చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)