వెబ్‌సైట్లల్లో మృతుల, క్షతగాత్రుల వివరాలు !

Telugu Lo Computer
0


కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య  290కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. హౌరా- చెన్నై మార్గంలో పట్టాల పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వాటిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. . ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని పోలీసులు, సహాయక సిబ్బంది బాలాసోర్ సహా వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. క్షతగాత్రుల పేర్లు, వివరాలను తెలియజేస్తూ రైల్వే అధికారులు ఓ జాబితాలను రూపొందించారు. అలాగే మృతదేహాలను గుర్తు పట్టడానికి వీలుగా వాటి ఫొటోలను తీసి.. వేర్వేరు వెబ్‌సైట్లల్లో పొందుపరిచారు. https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్‌సైట్లల్లో ఈ జాబితా, మృతదేహాల ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి, క్షతగాత్రుల వివరాలను తెలియజేయడానికి భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. దీని హెల్ప్‌లైన్ నంబర్ 1929. కటక్ రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీరామచంద్ర భంజా మెడికల్ కాలేజ్, భువనేశ్వర్ రైల్వే స్టేషన్, బారాముండా బస్టాండ్, విమానాశ్రయం వంటి అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు. 382 మంది ప్రయాణికులు ప్రస్తుతం ఒడిశాలోని భువనేశ్వర్, బాలాసోర్ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన అనంతరం 1,175 మంది ప్రయాణికులు వివిధ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. వారిలో 793 మంది డిశ్చార్జ్ అయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. మిగిలిన 382 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పేర్లతో కూడిన వివరాలు ఈ మూడు వెబ్‌సైట్లల్లో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)