కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు పోటెత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏ బస్సు చూసినా మహిళలతో రద్దీగా కనిపిస్తోంది. కూర్చోడానికి సీట్లు, నిలబడడానికి ప్లేస్ లేకపోయినా వేలాడుతూ ప్రయాణిస్తున్న దృశ్యాలు ఇటీవల కంటపడుతున్నాయి. బస్సు మొత్తం మహిళలతోనే నిండిపోవడంతో కండెక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిగిలిన వారికి టికెట్ ఇవ్వడానికి అష్టకష్టాలపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు వివాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజా ధార్వాడ జిల్లాలోని హుబ్లీలో ఓ మహిళా ప్రయాణికురాలకు, కండెక్టర్‌కు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ కాస్త ఘర్షణకు దారితీసి ప్రయాణికురాలిపై కండెక్టర్ చేయిచేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ కండెక్టర్‌ను బస్సు నుంచి బయటకు గెంటేశారు. నీతో మాకు పనిలేదు వెళ్లిపో అని బయటకు నెట్టేసినట్టు తెలుస్తోంది. చివరికి డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు బస్సును నిలిపివేసి, వారిని సర్దిచెప్పి శాంతింపజేశాడు.
బస్ నుంచి కండక్టర్‌ను త్రోసివేసిన మహిళా ప్రయాణికురాలు !
June 25, 2023
0
Tags