బెంగళూరు నగర శివార్లలోని మగాడిలో డ్యూటీలో ఉన్న ముగ్గురు పోలీసులు మద్యం సేవించి నడిరోడ్డు మీద చిందులు వేస్తూ సామాన్య ప్రజలతో గొడవ పెట్టుకుని నానా రాద్దాంతం చేశారు. మద్యం మత్తులో పోలీసులు హంగామా చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఏఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు రామనగర జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్తీక్ రెడ్డి తెలిపారు. సెలవులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ, ఏఎస్సైలు మంజునాథ్, నారాయణమూర్తిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇలాంటి సంఘటనలు పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తెస్తాయని, ఇలాంటి సంఘటనలు సీరియస్ గా తీసుకుంటామని, దీనిపై విచారణ జరిపి ముగ్గురిని సస్పెండ్ చేశామని రామనగర జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్తీక్ రెడ్డి తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులు మాగడి పోలీస్ స్టేషన్ నుండి రామనగర్ జిల్లా జైలులో ఖైదీని విడిచిపెట్టారు. తర్వాత తిరిగి మగాడి పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా వీరిద్దరూ మార్గం మధ్యలో లిక్కర్ పార్టీ చేసుకున్నారు. ఇలా డ్యూటీలో ఉన్న సమయంలో మద్యం మత్తులో ఉండడమే కాకుండా ప్రజలతో వాగ్వాదానికి దిగి స్థానికుల బెదిరించారు. మాగాడి ఏఎస్సై మంజునాథ్, కుదురు క్రైమ్ విభాగం పీసీ నారాయణ్, మరో ఇద్దరు పోలీసులు మద్యం తాగి స్టేషన్ కారులో సరదాగా బయలుదేరారు. అలాగే మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉన్న ఓ ఏఎస్ఐ యూనిఫాం విప్పి అటుగా వెళ్తున్న కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతే కాకుండా కారు డ్రైవర్ ను బూతులు తిట్టడంతో స్థానిక ప్రజలు సహనం కోల్పోయి పోలీసులను నిలదీశారు. ఆ సందర్బంలో ప్రజలతో మద్యం మత్తులో ఉన్న పోలీసులు వాగ్విదానికి దిగారు. ఆ సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి వైరల్‌గా అయ్యాయి. యూనీఫామ్ వేసుకుని డ్యూటీలో ఉన్న సమయంలో లిక్కర్ పార్టీ చేసుకోవడమే కాకుండా ప్రజలతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులనున సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని రామనగర జిల్లా ఎస్పీ కార్తీక్ రెడ్డి తెలిపారు.
మద్యం మత్తులో పోలీసులు హంగామా !
June 23, 2023
0
Tags