జిమ్‌ పేరుతో యువతిని మోసగించిన ట్రైనర్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ పాత బస్తీలోని టోలిచౌకిలో జిమ్‌ శిక్షణ పేరుతో ఓ ట్రైనర్‌ మహిళను లోబర్చుకొని లైంగిక దాడి చేశాడు. టోలిచౌకిలో ఆసిమ్‌ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా జిమ్‌ నడిపిస్తున్నాడు. అతనే జిమ్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తూ జిమ్‌ సెంటర్‌ను రన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం అదే ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువతి జిమ్‌లో చేరింది. శిక్షణ పేరుతో క్రమంగా సదరు యువతితో పరిచయం పెంచుకున్న ఆసీమ్‌ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి దిగాడు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి పరార్‌ అయ్యాడు. పెళ్లి లేదు ఏం లేదంటూ ముఖం చాటేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి లైంగికంగా వాడుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడిపై ఐపీసీ 376, 417,420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)