ప్రముఖ నటుడు అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యువ నటుడు ఉమాపతితో జరగనుంది. ఇదే విషయంపై తంబి రామయ్య తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ''ఐశ్వర్య, మా అబ్బాయి ఉమాపతి పెళ్లి వార్త నిజమే. అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి కంటిస్టెంట్‌గా పాల్గొన్నాడు. ఆనాటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఐశ్వర్య అంటే తనకు ఇష్టమని ఉమాపతి మాతో చెప్పాడు. ఇరు కుటుంబాల పెద్దలు ఇటీవల కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. త్వరలోనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయాలనుకుంటున్నాం. నవంబర్ 8న ఉమాపతి పుట్టినరోజు నాడు పెళ్లి డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తాం. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి ఉండొచ్చు'' అని తంబి రామయ్య తెలిపారు.
నటుడు అర్జున్ కుమార్తె వివాహం !
June 27, 2023
0
Tags