తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపు ఉత్తర్వులు జారీ

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం, పింఛనుదారులకు కరవు భృతి 2.73 శాతం పెంచుతూ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ఈ డీఏ పెంపు 2022 జనవరి నుంచి వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.

ప్రభుత్వంపై నెలకు రూ. 81.18 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 974.16 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పెంచిన డీఏ ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులకు 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు రూ. 1380.09 కోట్ల బకాయిలను చెల్లించనున్నారు. పెరిగిన డీఏ జూన్‌ నెల వేతనం, పింఛనుతో కలిపి ఇవ్వనున్నట్లుగా మంత్రి హరీష్ రావు ఇటీవలే ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. డీఏ పెంపుపై టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూటీఎస్, ట్రెసా, పెన్షనర్ల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)